Annadatha Sukhibava:
అన్నదాత సుఖీభవ పథకం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరిగాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది, తదనంతరం వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు Rs.43,402 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని తెలియజేయడం జరిగింది, రైతుల కోసం త్వరలోనే సబ్సిడీ మీద సూక్ష్మ పోషకాలను అందిస్తామని తెలియజేసారు, అలాగే వడ్డీ లేని రుణాలను రైతులకు బ్యాంకుల ద్వారా అందిస్తామని మంత్రి వివరించడం జరిగింది.
రైతులు వారి సమస్యలను 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చని తెలియజేశారు, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ గ్యారెంటీ లో భాగమైన Annadatha Sukhibava పథకం కోసం 4500 కోట్లను కేటాయించడం జరిగింది, ఈ పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలను కలుపుకొని మొత్తంగా 20000 రూపాయలను రైతుకు పెట్టుబడి సహాయం కింద అందించడం జరుగుతుంది, ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించడం జరిగింది
- PACS ల ద్వారా ఎరువుల పంపిణీ చేయుటకు
- Annadatha Sukhibava కొరకు – రూ.4,500 కోట్లు
- ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కొరకు – రూ.44.03 కోట్లు
- ఉచిత వ్యవసాయ విద్యుత్ కొరకు – రూ.7,241.3 కోట్లు
- ఉద్యాన యూనివర్సిటీ కొరకు – రూ.102.22 కోట్లు
- ఉద్యానశాఖ కొరకు – రూ.3,469.47 కోట్లు
- ఉపాధి హామీ అనుసంధానం కొరకు – రూ.5,150 కోట్లు
- ఎన్జీ రంగా యూనివర్సిటీ కొరకు – రూ.507.3 కోట్లు
- ఎన్టీఆర్ జలసిరి కొరకు – రూ.50 కోట్లు
- ఎరువుల సరఫరా కొరకు రూ.40 కోట్లు
- డిజిటల్ వ్యవసాయం కొరకు – రూ.44.77 కోట్లు
- నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ కొరకు – రూ.14,637.03 కోట్లు
- పంటల బీమా కొరకు – రూ.1,023 కోట్లు
- పట్టు పరిశ్రమ కొరకు – రూ.108.44 కోట్లు
- పశు సంవర్థక శాఖ కొరకు – రూ.1,095.71 కోట్లు
- పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు
- ప్రకృతి వ్యవసాయం కొరకు – రూ.422.96 కోట్లు
- ఫిషరీస్ యూనివర్సిటీ కొరకు – రూ.38 కోట్లు
- భూసార పరీక్షల నిర్వహణకు రూ.38.88 కోట్లు
- మత్స్యరంగం అభివృద్ధి కొరకు – రూ.521.34 కోట్లు
- రాయితీ పైన విత్తనాలు అందించుటకు రూ.240 కోట్లు
- రైతు సేవా కేంద్రాలు కొరకు – రూ.26.92 కోట్లు
- వడ్డీ లేని రుణాలు కొరకు – రూ.628 కోట్లు
- విత్తనాల పంపిణీ కొరకు రూ.240 కోట్లు
- వ్యవసాయ పశు విశ్వవిద్యాలయం కొరకు – రూ.171.72 కోట్లు
- వ్యవసాయ మార్కెటింగ్ కొరకు – రూ.314.8 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ కొరకు – 187.68 కోట్లు
- వ్యవసాయ శాఖ కొరకు – రూ.8,564.37 కోట్లు
- సహకార శాఖ కొరకు – రూ.308.26 కోట్లు
Annadatha Sukhibava అర్హులు కావాలంటే
- రైతు పొలం కలిగి ఉండాలి.
- కౌలు రైతులకు కూడా ఈ పథకం అందించే అవకాశం కలదు, కౌలు కార్డు ఆధారంగా వారు ఈ పథకానికి అర్హులు కావచ్చు
- కుటుంబం లో ఎంతమందికి పొలం ఉన్నా కేవలం ఒక వ్యక్తికీ మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది (రేషన్ కార్డు ఆధారంగా)
- Income tax కట్టేవారు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఈ పథకానికి అనర్హులు.
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “Annadatha Sukhibava: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త త్వరలోనే వారి ఖాతాలో Rs.20 వేల రూపాయలు జమ చేయనున్న ప్రభుత్వం.”