NPS Vatsalya Scheme
NPS Vatsalya Scheme: పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును కూడపెట్టాలనుకుంటున్న తల్లిదండ్రుల కోసం కేంద్రం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది అదే NPS వాత్సల్య పథకం (NPS Vatsalya Scheme) దీనిని 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు దీని గురించి ప్రస్తావన చేశారు, సెప్టెంబర్ 18, 2024న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ముఖ్యంగా పిల్లలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పొందే పెన్షన్ ను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఇప్పటినుండే పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది, ఈ పథకం పిల్లల భవిష్యత్తు కొరకు మరియు వారి ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరుచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద తెలుసుకుదాం.
ఈ పథకాన్ని పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రారంభించవచ్చు. NPS వాత్సల్య అకౌంట్ ఆన్లైన్ రూపంలో మరియు ఆఫ్లైన్ రూపంలో కూడా తెరవవచ్చు, ఆఫ్లైన్ రూపంలో ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ పథకానికి సంబంధించిన బ్యాంకు ఖాతాను కనీస మొత్తం 1000 రూపాయలతో ప్రారంభించవలసి ఉంటుంది దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏదీ ఉండదు.
🔥ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల పై కీలక సమాచారం
పిల్లలకు 18 సంవత్సరాలు నిండేంత వరకు ఈ బ్యాంకు ఖాతా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు మీదనే కొనసాగించబడుతుంది, పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా ఆటోమేటిక్గా NPS-Tier-1 ఖాతాగా పిల్లల పేరు మీదకి అప్డేట్ అవడం జరుగుతుంది, 18 సంవత్సరాలు నిండిన పిల్లలు మూడు నెలలలోగా కచ్చితంగా ఈ EKYC చేయాలి.
NPS Vatsalya Scheme ఇన్వెస్ట్మెంట్ ఎంపిక
- డిఫాల్ట్ ఛాయిస్ :- ఇది డిఫాల్ట్ గా ఎంపిక చేసే ఛాయిస్ ఇందులో మనం పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు
- ఆటో ఛాయిస్ :- ఇందులో ఖాతాదారుడు అగ్రెసివ్ (75% ఈక్విటీ), మోడరేట్ (50% ఈక్విటీ ) కన్జర్వేటివ్ (25% ఈక్విటీ ) ఏదో ఒక లైఫ్ సైకిల్ ఫండ్ ఎంచుకోవాలి.
- యాక్టివ్ ఛాయిస్ :- ఇందులో ఖాతాదారుడు ఈక్విటీ (75% వరకు), ప్రభుత్వ సెక్యూరిటీలు (100% వరకు), కార్పొరేట్ డెట్ (100% వరకు), మరియు ఆల్టర్నేట్ అసెట్స్ (5% వరకు) ఎందులో డబ్బును ఇన్వెస్ట్ చేయాలన్నదాన్ని స్వయంగా నిర్ణయించుకుంటారు
🔥సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
NPS Vatsalya Scheme డబ్బులు డ్రా చేయాలి లేదా పథకాన్ని ఉపసంహరించుకోవాలి అంటే…
- లాక్ ఇన్ పీరియడ్ 3 సంవత్సరాల తర్వాత పిల్లలకి 18 సంవత్సరాలు నిండే లోపు మనం చేసిన పెట్టుబడిలో మాత్రమే 25% తీసుకోవడానికి వీలవుతుంది అది కూడా కేవలం మూడుసార్లు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది.
- PFRDA నిబంధనల ప్రకారం పిల్లల విద్య, వైద్య, లేదా అంగవైకల్యం చెందినప్పుడు మాత్రమే ఈ మూడు సార్లు పాక్షిక విత్‌డ్రాయల్స్ చేయవచ్చు.
- 18 సంవత్సరాల నిండిన తర్వాత మనం చేసిన మొత్తం పెట్టుబడి5 లక్షలకు తక్కువగా ఉంటే మొత్తాన్ని విత్ డ్రా చేసుకొని అకౌంట్ క్లోజ్ చేయవచ్చు, అదే పెట్టుబడి రెండున్నర లక్షలకు పైగా ఉంటే అందులో 80% యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసి కేవలం 20% మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు.
- 18 సంవత్సరాలు నిండిన తర్వాత అకౌంట్ ను అలాగే కొనసాగిస్తూ 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం కలదు. అలా 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొత్తం కార్పస్ లో 60% మొత్తాన్ని ఒకేసారి వారికి అందించి 40%తో యాన్యుటి ప్లాన్ కొనుగోలు చేసి దాన్ని పెన్షన్ రూపంలో వారికి నెలనెలా అందజేస్తారు
- అకౌంట్ ఖాతాదారుడు చనిపోతే వేరే గార్డియన్ ఈ కేవైసీ చేయించుకొని పథకాన్ని కొనసాగించవచ్చు.
- ఒకవేళ మైనర్ ఖాతాదారుడికి ఏదైనా జరుగుతే ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బును నామినీకి అందజేస్తారు.
NPS Vatsalya Scheme అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్
- తల్లిదండ్రులు లేదా గార్డియన్ యొక్క ఐడెంటిటీ కార్డు
- పిల్లల జనన ధ్రువీకరణ పత్రం
- అడ్రస్ ప్రూఫ్
- తల్లిదండ్రి లేదా గార్డియన్ ఫోటోలు
- ఒకవేళ ఖాతాదారుడు NRI అయితే వారి పాస్పోర్ట్ మరియు చిరునామా
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “NPS Vatsalya Scheme: NPS వాత్సల్య స్కీం తో పిల్లలను కోటీశ్వరులు చేసే ఒక అద్భుతమైన అవకాశం”