IDBI Notification 2024: Bank Jobs
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నందు 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) మరియు అగ్రి అసెట్ ఆఫీసర్ (AAO) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
IDBI Notification 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) | 500 |
2 | అగ్రి అసెట్ ఆఫీసర్ (AAO) | 100 |
🔥అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) | ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందిన కాలేజీ లేదా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
2 | అగ్రి అసెట్ ఆఫీసర్ (AAO) | వ్యవసాయం, హార్టికల్చర్, వ్యవసాయం ఇంజనీరింగ్, ఫిషరీ సైన్స్/ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డైరీ సైన్స్/టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్ లో 4 సంవత్సరాల డిగ్రీ (B.Sc/B Tech/B.E) |
వయో పరిమితి
అభ్యర్థి తప్పనిసరిగా అక్టోబర్ 2, 1999 కంటే ముందుగా జన్మించి ఉండకూడదు మరియు అక్టోబర్ 1, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలుపుకొని)
కనిష్ట వయసు 20 సంవత్సరాలు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్- క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST/EXSM అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది.
🔥Amazon సంస్థలో ఇంటి నుండి పని
జీతం వివరాలు
జీతం సంవత్సరానికి రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
దరఖాస్తు రుసుము
Gen/OBC/EWS మహిళా అభ్యర్థులు 1050 రూపాయల దరఖాస్తు రుసుమును SC/ ST/ PWD దరఖాస్తుదారులు 250 రూపాయల దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపం లో చెల్లించవలసి ఉంటుంది
IDBI Notification 2024 – దరఖాస్తు చేయు విధానం
కేవలం ఆన్లైన్ ద్వారా 21 నవంబర్, 2024 నుండి 30 నవంబర్, 2024 లోపు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (Official Website) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో చివరన Careers అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఆ తర్వాత Current Openings అనే ఆప్షన్ ఎంచుకోవాలి అందులో Recruitment of Junior Assistant Manager (JAM) Grade ‘O’ : 2025-26 ను సెలెక్ట్ చేసుకుని కింద అప్లై నౌ అనే బటన్ నొక్కి ఆన్లైన్ దరఖాస్తు నింపాలి.
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గించబడుతుంది.
రాత పరీక్ష విధానం
S.No | పరీక్ష పేరు | ప్రశ్నలు | మార్కులు |
1 | లాజికల్ రీజనింగ్, డేటా ఎనాలిసిస్ & ఇంటర్ప్రెటేషన్ | 60 | 60 |
2 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 |
3 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 |
4 | జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్/ కంప్యూటర్/IT | 60 | 60 |
కేవలం AAO కు మాత్రమే | |||
5 | ప్రొఫెషనల్ నాలెడ్జి | 60 | 60 |
IDBI Notification 2024 – ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 21 నవంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 30 నవంబర్, 2024.

తాత్కాలిక ఆన్‌లైన్ పరీక్ష తేదీ – డిసెంబర్ 2024 / జనవరి 2025
Official Notification – Click Here
Official Website – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.