PM VidyaLakshmi Scheme 2024 – పీఎం విద్యాలక్ష్మి పథకం 2024.

PM VidyaLakshmi Scheme 2024 : Educational loan subsidy scheme

ప్రతిభ ఉంటుంది ఉన్నత విద్యలో అత్యున్నతంగా ఎదిగే సత్తాకు లోటు ఉండదు నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో చేరితే మరింత రాటు తేలవచ్చు అన్న ఆశ ఉంటుంది, అయితే పేదరికం ఆర్థిక పరిస్థితులు ఆ ఆశను నిరాశగా మారుస్తాయి జీవితంలో ఎదగాలన్న కోరికను మధ్యలోనే తుంచేస్తాయి ఇది దేశంలోని కోట్లాదిమంది విద్యార్థుల పరిస్థితి, అయితే ఇలాంటి విద్యార్థుల కష్టాలు తీర్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక పథకాన్ని తీసుకొచ్చింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు

నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించే పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని (PM VidyaLakshmi Scheme) అందుబాటులోకి తెచ్చింది. మరి ఏమిటీ పథకం ఇది విద్యార్థులకు ఎలా మేలు చేయబోతుంది విద్యా వ్యవస్థలో మార్పులకు ఇది ఏ విధంగా శ్రీకారం చుట్టబోతుంది అనే అంశాలను తెలుసుకుందాం.

PM VidyaLakshmi Scheme – పీఎం విద్యాలక్ష్మి పథకం.

ఉన్నత విద్యా అభ్యసించాలనుకుంటున్నపేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో 4.5 లక్షల వరకు ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తూ వచ్చేవాళ్ళు ఇప్పుడు వడ్డీ రాయితీతో 10 లక్షల వరకు రుణాలు అందించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. 

🔥అటవీ శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ 2024-25 నుండి 2030-31 వరకు 3600 కోట్ల రూపాయలు కేటాయించింది, కొత్త పథకంలో ఏడు లక్షల మంది కొత్త విద్యార్థులకు సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు రుణాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కారణంగా ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. 

అర్హులైన విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణాలు, వడ్డీ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యాలక్ష్మి పథకం కింద ఎలాంటి తాకట్టు హామీ లేకుండా స్టడీ లోన్స్ అందిస్తారు, అర్హత ఉన్న విద్యార్థులకు కేవలం 15 రోజుల్లోనే రుణాలు  మంజూరు చేస్తారు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న విద్యార్థులు 10 లక్షల వరకు విద్య రుణాలు పొందవచ్చు మొదట 4.5 లక్షల వరకు పూర్తి వడ్డీ రాయితీని కల్పిస్తారు. ఆ తరువాత ఎంత మొత్తం రుణం తీసుకున్న దానిపై విధించే వడ్డీలో 3% వరకు రాయితీ ఇస్తారు ఆడపిల్లలకు అదనపు రాయితీ ఉంటుంది. 

ఉన్నత విద్యాశాఖ లిస్టులో టాప్ 100 ర్యాంకుల్లో విద్యా ఉన్న ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి పథకం కింద లోన్స్ అందిస్తారు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని టాప్ 200 ర్యాంకుల్లో ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కూడా ఈ పథకం (PM VidyaLakshmi Scheme) కింద విద్య రుణాలు పొందడానికి అర్హులు. 

ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా, CA, ప్రొఫెషనల్ కోర్స్ మేనేజ్మెంట్ ఐఐటి వృత్తి విద్య కోర్సులు చదివే విద్యార్థులకు ఈ పథకం కింద లోన్ అందిస్తారు.

విద్యార్థులకు 7.5 లక్షల వరకు కేంద్రం హామీతో రుణాల పొందవచ్చు, ఈ రుణంలో 75% వరకు బ్యాంకులకు కేంద్రం హామీగా ఉంటుంది. ఈ రుణం కోసం విద్యార్థులు స్వయంగా ఎటువంటి పూచి కత్తు అందించవలసిన అవసరం లేదు. 

PM VidyaLakshmi Scheme 2024
PM VidyaLakshmi Scheme 2024

PM VidyaLakshmi Scheme portal – పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా గరిష్టంగా మూడు బ్యాంకులకు ఒకేసారి రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు, అర్హత కలిగిన విద్యార్థులకు 15 రోజుల వ్యవధిలో రుణాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది, ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే దానికి సంబంధించిన కారణాలను మెయిల్ ద్వారా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది.

ఏదైనా ఇతర గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి (PM VidyaLakshmi Scheme) అనర్హులు

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!