ECIL Recruitment 2024:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సంస్థ నందు ఒక సంవత్సరం కాలం ట్రైనింగ్ కొరకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
ECIL ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | 150 |
2 | డిప్లొమా అప్రెంటిస్ | 37 |
ECIL విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | 2022 ఏప్రిల్ 1 తర్వాత B.E/ B.Tech ఉత్తీర్ణులైన అభ్యర్థులు |
2 | డిప్లొమా అప్రెంటిస్ | 2022 ఏప్రిల్ 1 తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు |
వయో పరిమితి
గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలు మనకు వస్తే క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ : Rs.9000/-
- డిప్లొమా అప్రెంటిస్ : Rs.8000/-
దరఖాస్తు రుసుము
ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేయటానికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం (NATS) పోర్టల్ నందు రిజిస్టర్ అవ్వాలి
- తరువాత ECIL అధికారిక వెబ్సైట్ నందు Careers అనే కాలం కింద Current Job Openings అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- Advt.No 25/2024 ఎంపిక చేసుకొని అప్లై నౌ అనే బటన్ నొక్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి
ఎంపిక విధానం
- ఆన్లైన్ అప్లికేషన్ నందు ఇచ్చిన డేటా ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫై కోసం పిలుస్తారు.
- ఇటువంటి రాత పరీక్షలో మరియు ఇంటర్వ్యూలు ఉండవు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క వేదిక
- ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500 062. Phone no.: 040 2718 6454/2279
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 01 డిసెంబర్, 2024.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ – 09 డిసెంబర్, 2024.to 11 డిసెంబర్, 2024.
అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రారంభ తేదీ – 01 జనవరి, 2025.

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు క్రింది ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
NATS Portal Click Here
Online Application Link – Click Here
Notification PDF Click Here
ఇటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “ECIL Recruitment 2024: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నందు అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.”