AP Housing Scheme:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఇల్లు లేని వారి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) మరియు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఉచిత స్థలం మరియు 2.5 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకం ప్రారంభమైంది దీనికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
🔥ప్రభుత్వ పథకాలు అందాలంటే ఇది తప్పనిసరి
AP Housing Scheme అర్హత:
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే కింద తెలిపిన అర్హత ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగి లేదా కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు
- పది ఎకరాల భూమి ఉండకూడదు
- రేషన్ కార్డు కలిగి ఉండాలి
- ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే అర్హులు
- కుటుంబంలో ఎవరి పేరు పైన సొంత ఇల్లు ఉండకూడదు
- గతంలో లబ్ధి పొందిన వారు అనర్హులు
- ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు అనర్హులు
AP Housing Scheme కావాల్సిన పత్రాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకోవాలి
- రేషన్ కార్డు
- కుటుంబంలోని అందరి ఆధార్ కార్డులు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
AP Housing Scheme వివరాలు:
అర్హత ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది ఇందులో రెండు రకాల పథకాలు ఉన్నాయి మొదట ప్రభుత్వం సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 2.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుంది రెండవది ప్రభుత్వం సొంత ఇంటి స్థలం లేని వారికి రెండు సెంట్ల భూమిని ఇచ్చి అందులో ఇల్లు కట్టడానికి 2.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
🔥పదవ తరగతి అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
AP Housing Scheme దరఖాస్తు విధానం:
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్ విధానం లేదు కేవలం మీ స్థానిక గ్రామా వార్డు సచివాలయాన్ని సందర్శించి పై తెలిపిన పత్రాలు అన్ని సమర్పించి వారు ఇచ్చే 4B అప్లికేషన్ ఫారం నింపి వారికి సమర్పిస్తే వారు పరిశీలించి అర్హత ఉంటే ఇల్లు లేదా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు దీనికి కావాల్సిన అప్లికేషన్ ఫారం కింద ఇవ్వడం జరిగింది.
Application – Download Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్ లో మరో పథకం ప్రారంభమైంది ఉచిత స్థలం ఇల్లు కట్టడానికి 2.5 లక్షలు డబ్బు”