Aadabidda Nidhi Scheme: ఈ పథకం ఎప్పటి నుండి ప్రారంభం దరఖాస్తు కు పోస్ట్ ఆఫిస్ అకౌంట్ ఉండాల.?

Aadabidda Nidhi Scheme:

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స పథకాల్లో భాగంగా Aadabidda Nidhi పథకం ఒకటి ఇందులో భాగంగా 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ప్రతినెల 1500/- ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలో వచ్చిన అప్పటినుండి ఒక్కొక్కటిగా పథకాలన్నీ అమలుచేస్తోంది త్వరలో ప్రారంభమయ్యే ఈ Aadabidda Nidhi పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తుకు ఏ పత్రాలు కావాలి అనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. 

🔥ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులు దరఖాస్తు చేయండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aadabidda Nidhi పథకానికి అర్హులు:

ఈ పథకం దరఖాస్తు చేయాలంటే కావాల్సిన అర్హతలు క్రింద తెలియజేయడం జరిగింది 

  • రేషన్ కార్డు కలిగిన కుటుంబం 
  • ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు 
  • వయస్సు 18 నుండి 55 సంవత్సరాలు 
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు 
  • ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు 
  • పెన్షన్ పొందేవారు అనర్హులు 

Aadabidda Nidhi పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల..?

ఈ పథకం దరఖాస్తు చేయడానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరి అని ఒక ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది అది ఫేక్ సమాచారమని సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ వారు వెల్లడించారు ఏదైనా బ్యాంకు సేవింగ్స్ కాతా ఉంటే సరిపోతుంది బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు. ఏ ఖాతా లేనివారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 

Aadabidda Nidhi

🔥ఆధార్ కార్డు అప్డేట్ కు డిసెంబర్ 14 చివరి తేదీ

Aadabidda Nidhi పథకానికి కావాల్సిన పత్రాలు:

ఈ పథకం దరఖాస్తు చేయాలంటే కింద తెలిపిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకోండి 

  • రేషన్ కార్డు 
  • ఇన్కమ్ సర్టిఫికెట్ 
  • కుల దృవీకరణ పత్రం 
  • ఆధార్ కార్డ్ 
  • బ్యాంకు అకౌంట్ ఖాతా 
  • వయసు ధ్రువీకరణ పత్రం

Aadabidda Nidhi పథకం దరఖాస్తు తేది..?

ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేసింది ఎప్పుడు ప్రారంభం చేస్తుందో ఇంకా వెల్లడించలేదు ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లో ఉన్నాయి త్వరలో ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రారంభించనున్నారు ఆ తర్వాత ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన దరఖాస్తులు సిద్ధం చేసుకోండి. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ కూడా డిసెంబర్ రెండవ తేదీ నుండి మొదలవుతుంది రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోండి మీ స్థానిక గ్రామ వార్డు సచివాలయాల్లో. ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అన్ని పథకాల్లో అమలు చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి Join WhatsApp Group 

3 thoughts on “Aadabidda Nidhi Scheme: ఈ పథకం ఎప్పటి నుండి ప్రారంభం దరఖాస్తు కు పోస్ట్ ఆఫిస్ అకౌంట్ ఉండాల.?”

Leave a Comment

error: Content is protected !!