CDFD Recruitment 2024:
సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
CDFD Recruitment 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | టెక్నికల్ ఆఫీసర్ | 01 |
2 | టెక్నికల్ అసిస్టెంట్ | 02 |
3 | జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ | 01 |
4 | జూనియర్ అసిస్టెంట్ | 02 |
5 | స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ | 02 |
విద్యా అర్హత
- టెక్నికల్ ఆఫీసర్ – ఫస్ట్ క్లాస్ B.Sc 5 సంవత్సరాల అనుభవం లేదా M.Sc లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ – ఫస్ట్ క్లాస్ B.Sc/ B.Tech మూడేళ్ల అనుభవం లేదా సైన్స్/ టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైన్స్/టెక్నాలజీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ – గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ నందు మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- జూనియర్ అసిస్టెంట్ – 12th పాస్ మరియు ఇంగ్లిష్ లో గంటకు 35 WPM టైపింగ్ వేగం
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ – 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి
వయో పరిమితి
S.No | పోస్ట్ పేరు | గరిష్ట వయసు |
1 | టెక్నికల్ ఆఫీసర్ | 30 సంవత్సరాలు |
2 | టెక్నికల్ అసిస్టెంట్ | 30 సంవత్సరాలు |
3 | జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ | 25 సంవత్సరాలు |
4 | జూనియర్ అసిస్టెంట్ | 25 సంవత్సరాలు |
5 | స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ | 25 సంవత్సరాలు |
జీతం వివరాలు
S.No | పోస్ట్ పేరు | జీతం |
1 | టెక్నికల్ ఆఫీసర్ | Rs.70,290/- |
2 | టెక్నికల్ అసిస్టెంట్ | Rs.70,290/- |
3 | జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ | Rs.58,944/- |
4 | జూనియర్ అసిస్టెంట్ | Rs.38,483/- |
5 | స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ | Rs.35,006/- |
దరఖాస్తు రుసుము
UR / EWS / OBC (NCL) అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది, SC /ST / PwBD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి
- ఆన్లైన్ అప్లికేషన్ను To The Head-Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, Telangana అనే చిరునామాకు 15 జనవరి 2025 నాటికి పంపవలెను.
🔥NLC ప్రభుత్వ సంస్థలో 334 ఉద్యోగాలు విడుదల
ఎంపిక విధానం
- అభ్యర్థులు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు
![CDFD Recruitment 2024](https://teluguguruvu.com/wp-content/uploads/2024/12/20241203_200622-300x169.jpg)
CDFD ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 02 డిసెంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 31 డిసెంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపుటకు చివరి తేదీ – 15 జనవరి 2025
CDFD Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాల ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.