Aadhar Card Latest Update:
ఆధార్ కార్డు (Aadhar Card) అనేది మన దేశ పౌరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, రోజు మన నిత్య జీవితంలో ఎక్కడో చోట ఆధార్ ను ఉపయోగిస్తూనే ఉంటాం, బ్యాంకు సేవలకు, స్కూల్ లేదా కాలేజీ అడ్మిషన్ కొరకు, దైవ దర్శనాల కొరకు, హాస్పిటల్స్ నందు, ఏవైనా సర్టిఫికెట్లు అప్లై చేయడం కొరకు ఇలా ఇంకా ఎన్నో సేవలు కొరకు మనం ఆధార్ కార్డును ఉపయోగిస్తూనే ఉంటాం, ఇలాంటి సేవలకు అంతరాయం కలగకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మీ ఆధార్ ను డాక్యుమెంట్ అప్డేట్ చేయవలసి ఉంటుంది, ఆధార్ అప్డేట్ చేసుకోదలచిన వారు డిసెంబర్ 14 తేదీలోపు ఫ్రీగా వారి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత చేసుకోవాలి అనుకుంటే 50 రూపాయలు రుసుము తో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవలసి వస్తుంది.
🔥ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోండి
కార్డు వచ్చినప్పుడు నుండి 10 సంవత్సరాలుగా కార్డులో ఎటువంటి మార్పులు చేయకుండా ఉండే వారికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 14 వ తేదీ వరకు ఫ్రీగా వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది, చాలా కాలంగా అప్డేట్ చేసుకోని వారి ఆధార్ కార్డులను కేంద్రం ఇనాక్టివ్ చేసే అవకాశం ఉంది, ఆధార్ కార్డు ఇనాక్టివ్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆధార్ ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది
Aadhar Card ఫ్రీగా ఎలా అప్డేట్ చేసుకోవాలి:
- ముందుగా UIDAI అఫీషియల్ వెబ్సైట్ సందర్శించారు
- ఇందులో LOGIN మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అవ్వగానే డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, అది క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీకు సంబంధించిన ఆధార్ అక్కడ చూపించడం జరుగుతుంది, ఇందులో కనపడే వివరాలు అన్ని కరెక్ట్ గా ఉంటే ఐ వెరిఫై అనే డైలాగ్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- ఇక్కడ POI (Proof Of Identity) మరియు POA (Proof Of Address) సంబంధించిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి.
- సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత SRN నెంబర్ మనకు చూపించడం జరుగుతుంది, ఈ SRN నెంబర్ తో మన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ రిక్వెస్ట్ ను మనం ట్రాక్ చేసుకోవచ్చు.
🔥డిగ్రీ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
POI (Proof Of Identity) డాక్యుమెంట్లు:
- భారతీయ పాస్ పోర్ట్
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- విద్యుత్ బిల్లు
- టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ బిల్లు
- రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డీడ్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్‌యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి
- లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
- పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబర్ కార్డు
- వసతి కేటాయింపు పత్రము
ఇటువంటి Aadhar Card అప్డేట్ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి