AP లో 10th సర్టిఫికెట్స్ 1969 నుండి ఆన్లైన్ | AP 10th Certificates Download | AP SSC certificate Download From 1969 

AP 10th Certificates:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ సర్టిఫికెట్లు అన్ని ఆన్లైన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది 1969 నుండి 2024 వరకు అందరి పదవ తరగతి ధ్రువీకరణ పత్రాలు అన్నీ ఇకపై ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. 50 సంవత్సరాల క్రితం పదవ తరగతి చదివిన వారు కూడా సులభంగా వాటిని డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే 2004 నుంచి 2024 వరకు టెన్త్ సర్టిఫికెట్లు డిజిటలైజేషన్ చేశారు వాటిని డిజి లాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం 1969 నుండి 1990 వరకు సర్టిఫికెట్లు మొదట డిజిటలైజేషన్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది ఆ తర్వాత 1990 నుండి 2003 వరకు ఆన్లైన్ చేస్తారు.

🔥10వ తరగతి సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కు అప్పగించింది ఇందుకోసం 1.68 కోట్లు బడ్జెట్ కేటాయించింది. డిజిటలైజేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు పదవ తరగతి సర్టిఫికెట్లు డిజి లాకర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే రెండు సంవత్సరాల వరకు ఉచితంగా సవరణలు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గతంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పోతే డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందే వరకు దరఖాస్తులు అడ్మిషన్ల కోసం వేచి చూసేది వచ్చేది గత మూడు సంవత్సరాల నుండి సర్టిఫికెట్లు ఆన్లైన్ చేస్తున్నారు. డిజి లాకర్ ద్వారా డూప్లికేట్ సర్టిఫికెట్ కూడా పొందే అవకాశం ఉంది.

How to download AP 10th Certificates:

ప్రస్తుతం ప్రభుత్వం వీటిని డిజిటలైజేషన్ చేయనుంది త్వరలో మనకు అందుబాటులో ఈ వ్యవస్థ వస్తుంది వీటిని మనం డౌన్లోడ్ చేయడానికి క్రింద తెలిపిన విధంగా అనుసరించాలి.

  • మొదట ప్లే స్టోర్ నందు డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేయాలి
  • అందులో మన వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వాలి
  • ఆ తర్వాత మీ పదవ తరగతి రోల్ నెంబర్ పుట్టిన తేదీ ఇచ్చి సెర్చ్ చేస్తే మన సర్టిఫికెట్ వస్తుంది
  • వాటిని మనం డౌన్లోడ్ చేసి అవసరాలకు వినియోగించుకోవచ్చు
  • వీటి ద్వారా డూప్లికేట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు
  • ఇప్పటికే 2004 నుండి 2024 వరకు డిజి లాకర్లు సర్టిఫికెట్స్ అందుబాటులో ఉన్నాయి
  • త్వరలో 1969 నుండి ఈ సర్టిఫికెట్స్ అందుబాటులోకి వస్తాయి

Join WhatsApp Group 

ఇటువంటి AP 10th Certificates సమాచారం కొరకు రోజు మన వెబ్ సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!