AP Contract Jobs:
ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలో 257 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్(EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ మరియు కోఆర్డినేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యా అర్హత, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు చూసి Apply చేయండి.
🔥ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 257 కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి ఇందులో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ మరియు కోఆర్డినేటర్ పోస్టులు భర్తీ చేస్తారు.
విద్యా అర్హత:
- కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్: సైకాలజీ లో M.Sc లేదా ఎంఏ పూర్తి చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- కోఆర్డినేటర్: సైకియాట్రిక్ సోషల్ వర్క్ లో ఎంఎస్సీ లేదా ఎంఫిల్ పూర్తి చేసి ఉండాలి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
🔥AP విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు
వయస్సు:
ఈ AP Contract Jobs దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన విధంగా వయస్సు ఉండాలి
- కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులకు 35 సంవత్సరాల లోపు ఉండాలి
- కోఆర్డినేటర్ పోస్టులకు 45 సంవత్సరాల లోపు ఉండాలి
ఎంపిక విధానం:
అభ్యర్థులకు వారి విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
జీతం:
- కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులకు 30,000/- జీతం ఇస్తారు
- కోఆర్డినేటర్ పోస్టులకు 50,000/- జీతం చెల్లిస్తారు
🔥కాఫీ బోర్డులో డిగ్రీ అర్హత ఉద్యోగం
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 19 నవంబర్ 2024 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మూడు డిసెంబర్ 2024
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AP Contract Jobs సమాచారం కొరకు రోజు వెబ్ సైట్ సందర్శించండి మీకు అన్ని ఉద్యోగ సమాచారాలు లభిస్తాయి.