AP Free Scooty Scheme:
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో పథకం తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఉచితంగా స్కూటీ అందిస్తున్నారు ఈ ఏడాది 1750 మందికి అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలు చూసుకుంటే.
🔥ఉచిత స్థలం మరియు ఇల్లు ఆంధ్రప్రదేశ్ కొత్త పథకం
AP Free Scooty Scheme Details:
కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు 100% రాయితీతో అందించనుంది ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుండి నిధులు విడుదల అయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తుంది 2024-25 ఏడాదిగాను నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించాలని ఒక్క వాహనం ఖరీదు లక్ష వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది.
మొత్తం వాహనాలకు 17.5 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నాలుగు నెలల్లో ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ పథకం ప్రతి సంవత్సరం అమలయ్యే విధంగా చూడాలని సీఎం గారు ఆదేశించారు గత ప్రభుత్వంలో ఈ పథకం ఇస్తామని ప్రకటించగా అప్పుడు దాదాపు 4,000 మంది దరఖాస్తు చేయగా గత ప్రభుత్వం వాటిని ఇవ్వలేదు క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉండగా కూటమి ప్రభుత్వం దీనిని తిరిగి ప్రారంభించడం జరిగింది ఇక నుండి ప్రతి సంవత్సరం ఈ పథకం ఉంటుందని తెలపడం జరిగింది.
🔥10వ తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు
AP Free Scooty Scheme కావాల్సిన అర్హతలు:
- డిగ్రీ ఆ పైన ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు
- ఏడాదికి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి కూడా ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు
- 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు
- దరఖాస్తు చేయడానికి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి
- సంవత్సరానికి ఆదాయం మూడు లక్షల లోపు ఉన్నవారు అర్హులు
ధరఖాస్తూ విధానం:
ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ ప్రక్రియ నిర్వహించాలని భావిస్తుంది రానున్న నాలుగు నెలల్లో ఈ పథకం గ్రామ వార్డు సచివాలయం మరియు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తారు ఎటువంటి సమాచారం లభించిన మన వెబ్సైట్ నందు సమాచారం ఇస్తాము.
1 thought on “AP Free Scooty Scheme: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ఉచిత స్కూటీ ఇస్తారు”