AP Grama Panchayath Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీలో పరిధిలోని అంగన్వాడీ సెంటర్స్ నందు 12 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో 108 అంగన్వాడి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు, అంగన్వాడీ మినీ కార్యకర్త ఖాళీలు భర్తీ చేస్తున్నారు. వీటికి 10 వ తరగతి మరియు 7 వ తరగతి అర్హత ఉంటే చాలు. నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ అంగన్వాడీ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి
🔥జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 12 ICDS ప్రాజెక్ట్ ల పరిధిలో 108 అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ AP అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 10 వ తరగతి అర్హత ఉండాలి. అంగన్వాడి సహాయకురాలు పోస్టుకు 7 వ తరగతి విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
పోస్టుల వివరాలు:
ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు, మార్కాపురం తదితర ICDS ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అంగన్వాడీ కార్యకర్త 15, మినీ అంగన్వాడి కార్యకర్త 4, అంగన్వాడి సహాయకురాలు 84 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥హౌసింగ్ డిపార్ట్మెంట్ భారీగా ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 1 జూలై 2024 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు 21 సంవత్సరాల అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
జీతం:
AP Anganwadi కార్యకర్త పోస్టుకు జీతం 11,500/- మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు పోస్టుకు 7,500/- జీతం ఇస్తారు.
దరఖాస్తుకు కావలసిన ధ్రువ పత్రాలు:
- పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- స్థానికత ధ్రువీకరణ పత్రం
- పదవ తరగతి సర్టిఫికెట్
- వివాహితులు అయితే వివాహ దృవీకరణ పత్రం
- దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
- వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ 10 వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥AMAZON సంస్థలో ఐదు రోజుల్లో ఉద్యోగం ఇస్తారు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 23 డిసెంబర్ వరకు అవకాశం ఉంది అర్హులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండా మీ ICDS CDPO కార్యాలయానికి వెళ్లి పై తెలిపిన ధ్రువపత్రాలు మరియు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
Notification – Click Here
Application – Click Here
ఇటువంటి AP గ్రామపంచాయతీ అంగన్వాడి ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “AP గ్రామ పంచాయతీల్లో 10th జాబ్స్ | AP Grama Panchayath Jobs 2024”