AP Pensions Update:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి శుభవార్త ఇకనుండి మూడు నెలల పెన్షన్ ఒకేసారి పొందే అవకాశం లభించింది వీటికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది పూర్తి వివరాలు చూసుకుంటే. అనివార్య కారణాలు మరియు వైద్య అవసరాల మేరకు చాలామంది ప్రతి నెల ఒకటవ తేదీ అందుబాటులో లేక పెన్షన్లు అందుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
AP Pensions Guidelines:
కొత్త మార్గదర్శకాలు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి
- మొదటి నెల ఎవరైనా పెన్షన్ అందుకోలేక పోతే వారికి ఆ తర్వాతి నెల రెండు నెలల పెన్షన్ ఇస్తారు.
- ఒకవేళ వరుసగా రెండు నెలల పెన్షన్ అందుకోలేక పోతే మూడవ నెలలో మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు.
- ఒకవేళ మూడు నెలల పెన్షన్ అందుకోలేని వారికి పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది.
- ఇలా పెన్షన్ రద్దు అయితే అటువంటి వారు గ్రామ వార్డు సచివాలయం సంక్షేమ కార్యదర్శి ను సంప్రదించి రోల్ బ్యాక్ పెట్టుకునే అవకాశం ఉంది.
- ఈ విధంగా రోల్ బ్యాక్ పెట్టుకున్న వారికి గతంలో తీసుకొని పెన్షన్ ను ఇవ్వరు కేవలం ఆ నెల పెన్షన్ మాత్రమే ఇస్తారు
AP Pensions వితంతువులకు శుభవార్త:
వితంతు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త లాంటి వార్త ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో ప్రభుత్వం ద్వారా అందే వృద్ధాప్య పెన్షన్ అందుకుంటూ మగవారు మరణిస్తే ఆ నెలలోనే వారి భార్యకు వితంతు పెన్షన్ జారీ చేసే మార్గదర్శకాలు ఇవి. వీటికోసం మీరు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు సచివాలయ సిబ్బంది సంప్రదిస్తే వారు మొబైల్ అప్లికేషన్ నందు దరఖాస్తు చేస్తారు తర్వాత మీరు కింద తెలిపిన పత్రాలు సమర్పిస్తే మీకు కొత్త పెన్షన్ ఒక నెలలోనే జారీ చేస్తారు.
🔥మహిళలకు 2500 ఇచ్చే పథకం పూర్తి వివరాలు
AP Pensions కావాల్సిన పత్రాలు:
వితంతు పెన్షన్ దరఖాస్తు కొరకు కావలసిన పత్రాలు
- ఆధార్ కార్డు
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
పైన తెలిపిన ధ్రువపత్రాలు సచివాలయంలోని సంక్షేమ కార్యదర్శికి సమర్పిస్తే వారు దరఖాస్తు చేసి కొత్త పెన్షన్ మంజూరు చేయిస్తారు ఈ ప్రక్రియలో భర్త చనిపోయిన నెలలో 15వ తేదీ లోపు దరఖాస్తు చేస్తే ఆ మరుసటి నెలలో మొదటి తారీకున పెన్షన్ అందుకోవచ్చు. ఇటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కావున అర్హత ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి AP Pensions సమాచారాన్ని రోజు పొందడానికి మన వెబ్సైట్ teluguguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP Pensions: ఆంధ్రపదేశ్ లో 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు.. వితంతు పెన్షన్ ఒక నెలలో మంజూరు”