AP Pensions Survey:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ల సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయం పరిధిలో సర్వే నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇందులో దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఆ తర్వాత వితంతు విభాగంలో ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
🔥మహిళలకు ప్రతి నెల 7000 ఇచ్చే పథకం
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం పరిధిలో చేపట్టిన పెన్షన్ల(AP Pensions Survey) తనిఖీల్లో ఇది బయటపడటం జరిగింది. ఏ విభాగంలో ఎక్కువగా అనర్హులు ఉన్నారో గుర్తించేందుకు అధికారులు ఈ ఇది సర్వే నిర్వహించడం జరిగింది. అయితే కొన్నిచోట్ల పింఛన్ల తనిఖీకి లబ్ధిదారులు అందుబాటులో ఉండడం లేదు కావున కొన్నిచోట్ల అనర్హులను గుర్తించడం కష్టతరం అవుతోంది మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 11,000 మంది పింఛన్దారుల వివరాలను వారి ఇల్లు వద్దకు వెళ్లి పరిశీలించగా అందులో 450 మంది వరకు అనర్హులు ఉన్నట్లు తేల్చారు.
🔥AP పదవ తరగతి పరీక్షా షెడ్యూల్ విడుదల
ఒకటి లేదా రెండు సచివాలయాలు మినహా అన్నిచోట్ల దివ్యాంగుల కోటాలో అనర్హుల పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది ఇందులో బదిరుల కేటగిరీలో అత్యధికంగా అనర్హులు గుర్తించారు ఒకే కుటుంబంలో రెండు నుంచి మూడు పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఈ తనిఖీలు ఏ ఏ ప్రశ్నలు ఉంటాయి ఎలా సర్వే చేస్తారో ప్రస్తుతం చూసుకుంటే.
AP Pensions Survey Questions:
మొదటగా ఆ గ్రామంలో పనిచేసేవారు కాకుండా పక్క మండలాలకు సంబంధించిన సిబ్బందిని తనిఖీ కోసం పంపించడం జరుగుతుంది. అధికారులు వచ్చిన సమయంలో అడిగే ప్రశ్నల వివరాలు చూసుకుంటే.
- కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12000 ఉందా చూస్తారు.
- మీ కుటుంబంలో మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాన్ని 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ ఉందా చూస్తారు.
- మీ కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా చూస్తారు ఇందులో టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు ఉంటుంది.
- మీ కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా తనిఖీ చేస్తారు
- మీ సరాసరి 12 నెలల విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్లు కంటే ఎక్కువ ఉందా చూస్తారు
- మున్సిపల్ ప్రాంతంలో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా చూస్తారు.
- కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా.
- కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా
- దివ్యాంగులు అయితే నిజంగానే వీరికి అంగవైకల్యం ఉందా ఒకవేళ అధికారికి సందేహం వస్తే మెడికల్ పరీక్షకు సిఫార్సు చేయవచ్చు.
ఈ విధమైన సర్వే నిర్వహించి లబ్ధిదారులను తనిఖీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించే అవకాశం ఉంది.
ఇటువంటి AP Pensions Survey సంబంధించి సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Pensions Survey: పెన్షన్ల సర్వే లో భారీగా బోగస్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ”