AP Pension Update:
ఆంధ్రప్రదేశ్ లో గత వారం పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా పెన్షన్ల తనిఖీ జరిగిన విషయం తెలిసిందే మొత్తం 11 వేల మందికి ఈ తనిఖీలు చేశారు అందులో 563 మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు తేల్చారు. అనర్హులు అందరికీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు ఇవ్వనున్నారు నోటీసు తీసుకొని వారికి ఈ నెల పెన్షన్ నిలిపి వేస్తారు. నోటీసు తీసుకొని అందులో తెలియజేసిన విధంగా సంబంధిత పత్రాలు గ్రామ వార్డు సచివాలయాల్లో సమర్పించాలి సకాలంలో సమర్పించకపోతే మీ పెన్షన్ రద్దు చేస్తారు ప్రస్తుతం ఇది కేవలం పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా చేసిన తనిఖీ లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ పెన్షన్ దారులను తనిఖీ చేయనున్నారు అందులో అనర్హులుగా తేలితే పెన్షన్లు రద్దు చేసే అవకాశం ఉంది అలాగే భారీగా తప్పుడు ధృవపత్రాలు పొంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిని ప్రభుత్వం గుర్తించనుంది త్వరలో అన్ని గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అనర్హులను గుర్తించనున్నారు వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్లు రద్దు చేస్తారు.
ఇటువంటి AP పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.