AP Pensions Update:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ కొంతమందిని ఇప్పటికే నిర్వహించడం జరిగింది. వారందరూ నోటీసులు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ నందు పరీక్షలు నిర్వహించారు ఇందులో 40% మంది అనర్హులుగా తేలారు అలాగే మంచానికే పరిమితం అయిన వారికి 15,000/- పెన్షన్ ఇస్తున్నారు వారిలో 30% మంది అనర్హులుగా ఉన్నారు వారికి ఈ నెల పెన్షన్ వస్తుందా రాదా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయాల కు ఎటువంటి సమాచారం లేదు. ఒక వేళ రద్దుచేసి ఉంటే ఇప్పటికే రద్దు అయిన వారికి నోటీసులు ఇచ్చేవారు ఎటువంటి నోటీసులు ఇప్పటివరకు అందలేదు.
గ్రామ వార్డు సచివాలయం పెన్షన్ యాప్ నందు 31 జనవరి రోజున అర్హుల పేర్లు రావడం జరుగుతుంది ఆ రోజున పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 2025 వరకు నిర్వహిస్తారు అనర్హులుగా తేలిన వారికి పెన్షన్లు రద్దు అవుతాయి. ఈ నెల పెన్షన్ రద్దు అయిన వివరాలు 31 జనవరి లోపు తెలిసే అవకాశం ఉంది పూర్తి సమాచారం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది కావున official సమాచారం వచ్చే వరకు వేచి చూడండి ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ఇది.
ఇటువంటి AP Pensions సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ అయిన TeluguGuruvu.com సందర్శించండి.