AP Ration Card: దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం ఎప్పటి నుండి ఉండచ్చు..?

AP Ration Card Update:

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు మరియు ఉచిత బియ్యం కొరకు ఉపయోగపడే Ration Card సంబంధించి ప్రక్రియ డిసెంబర్ రెండవ తేదీ నుండి మొదలవుతుందని మొదట ప్రకటించడం జరిగింది ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఎప్పటినుండి ప్రారంభమవుతుంది అనే పూర్తి వివరాలు ఒకసారి మనం చూసుకుంటే. 

🔥ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుండి ప్రారంభం 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రేషన్ కార్డ్ ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీ మొదలయ్యి డిసెంబర్ 28 వరకు ఏదైనా మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇది కొంత ఆలస్యం అయింది వీటికి గల కారణాలు చూసుకుంటే ఇంకా ప్రభుత్వం నుండి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు అలాగే గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ నందు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. 

Ration Card దరఖాస్తు ఎప్పటి నుండి:

కొత్త కార్డులు మరియు మార్పులు చేర్పులు దరఖాస్తు ప్రక్రియ రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ మూడవ తేదీ సాయంత్రం ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రముఖంగా రేషన్ కార్డులు మరియు పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ పై నిర్ణయం తీసుకోనుంది కావున ఈ ప్రక్రియ మొదలవడానికి రెండు రోజులు ఆలస్యం అవ్వనుంది పూర్తి వివరాలు డిసెంబర్ 3 సాయంత్రం లోపు తెలిసే అవకాశం ఉంది.

🔥KBS బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ విడుదల

Ration Card దరఖాస్తు కావాల్సిన పత్రాలు: 

గ్రామ వార్డు సచివాలయం సందర్శించి మనం రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీటి దరఖాస్తు చేయడానికి కావలసిన పత్రాలు చూసుకుంటే. 

  • కుటుంబ ఆధార్ కార్డులు 
  • కొత్త జంటలు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ 
  • చిన్న పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ 
  • తొలగించుటకు మరణ ధ్రువీకరణ పత్రం 
  • పెళ్లి అయిన వారిని తొలగించుటకు మ్యారేజ్ సర్టిఫికెట్

పై తెలిపిన విధంగా మీకు ఏ సేవలు కావాలంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి డిసెంబర్ 28 వరకు అవకాశం ఇచ్చారు జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. 

Join WhatsApp Group 

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి

1 thought on “AP Ration Card: దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం ఎప్పటి నుండి ఉండచ్చు..?”

Leave a Comment

error: Content is protected !!