APPSC Junior Assistant Update:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు వివిధ నోటిఫికేషన్ లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ టెస్ట్ సంబంధించి తేదీలను విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి పరీక్షలకు హాజరు అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ (ఎన్టీఆర్ యూనివర్సిటీ) నందు ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే వాటికి సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది ఆ పరీక్షా తేదీలను ప్రస్తుతం విడుదల చేయడం జరిగింది.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అప్డేట్:
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొత్తం 37 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను 16 మార్చి 2025 ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.
జూనియర్ అసిస్టెంట్ అప్డేట్:
జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఎన్టీఆర్ వైద్య సేవ యూనివర్సిటీ నందు విడుదల చేశారు మొత్తం 20 పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే నిర్వహించగా మెయిన్స్ పరీక్షను 17 మార్చ్ 2025న ఉదయం మరియు మధ్యాహ్నం రెండు పేపర్లు నిర్వహించనున్నారు.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగాల కీలక సమాచారం
పూర్తి వివరాలను క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ చూసి గమనించగలరు.
Download Notice – Click Here
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం కొరకు రోజూ మన వెబ్సైట్ సందర్శించండి.
Obaiah