Grama Sachivalayam Update:
గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రెండు డిసెంబర్ 2024న సీఎం చంద్రబాబు గారు ఈ వ్యవస్థ పైన సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ వ్యవస్థ ఏ విధంగా మార్పులు చేయాలి అనే అంశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు పూర్తి వివరాలు పరిశీలిస్తే.
🔥రేషన్ కార్డుల దరఖాస్తు మరింత ఆలస్యం
గ్రామ అవార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు సచివాలయ శాఖ మంత్రితో కలిసి ఉండవల్లి లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు గ్రామాల్లో పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మెరుగైన సేవలు అందించాలని దానిపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. ఉద్యోగులు, ప్రజల అవసరాలపై మరియు సౌకర్యాలపై సీఎం అధికారులకు సూచనలు చేశారు. అందరూ ఉద్యోగులకు సమానమైన పని మరియు బాధ్యత ఉండేలా చూడాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
🔥హౌసింగ్ పథకం ప్రారంభం అయ్యింది దరఖాస్తు చేయండి
Grama Sachivalayam ఉద్యోగుల వివరాలు:
ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 1,27,175 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్న యువకులు 50,284 మంది ఉన్నట్టుగా సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు అలాగే 28 నుండి 37 సంవత్సరాల లోపు 54,774 మంది ఉన్నారని వివరించారు. పీజీ, పీహెచ్డీ ఇలాంటి కోర్సులు చేసిన అభ్యర్థులు దాదాపు 14% ఉన్నారు. అలాగే వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు 31% ఉన్నట్టు నివేదిక ఇచ్చారు యువత అత్యధికంగా ఉన్న సచివాలయ వ్యవస్థను ఏ విధంగా వినియోగించుకోవాలో అనే అంశం పైన సమావేశంలో ముఖ్యంగా సీఎం గారు చర్చించారు.
అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలను వివరించడం జరిగింది. మరో నాలుగు రోజుల్లో ఇంకోసారి సమావేశం నిర్వహించి నివేదికలో మరింత సమగ్రత అవసరమని ఇంకా ఏ విధంగా ఈ వ్యవస్థను మార్పులు చేయవచ్చు అలాగే ఉద్యోగులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశాలను పరిశీలించాలని అధికారులకు సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
🔥విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యంగా Grama Sachivalayam లో పరిశీలిస్తే కొంతమంది ఉద్యోగులకు అత్యధికంగా పని ఉండడం జరిగింది కొంతమందికి అస్సలు పని లేకుండా ఉన్నారు ఈ విధమైన తీరు సరికాదని ఉద్యోగుల్లో సఖ్యత ఏర్పడి వ్యవస్థ ముందుకు వెళ్లదని కావున అందరు ఉద్యోగులకు సమానమైన పనిని ఉండేలా చూడాలని ముఖ్యంగా సీఎం గారు ఆదేశాలు ఇచ్చారని సమాచారం. త్వరలో ఈ వ్యవస్థపై సమూల మార్పులు చేసే అవకాశం ఉంది.
ఇటువంటి ప్రభుత్వ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.