Grama Sachivalayam Rationalise:
ఆంధ్రప్రదేశ్ లో బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు గారు సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రేష్నలైజ్ చేయాలని సూచించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్న పంచాయతీల్లో కూడా సచివాలయం పెట్టారని వీలైనంత వరకు జనాభా ఆధారంగా ఈ హేతుబద్దీకరణ ప్రక్రియ కొనసాగిద్దామని అధికారులకు సూచించారు రెండు, మూడు పంచాయతీలకు ఒక సచివాలయం లేదా ఒక పంచాయతీకి ఒకటా అన్నదానిపై జిల్లా కలెక్టర్లు కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,23,86 మంది పనిచేస్తున్నారు. వాళ్లను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అనే దానిపై కలెక్టర్లకు ప్రణాళికలు ఉండాలన్నారు ప్రభుత్వం లక్ష్యాలు సాధించాలంటే సచివాలయ సిబ్బంది అత్యంత కీలకమై స్పష్టం చేశారు ఈ సిబ్బందిలో ఉన్నత విద్యావంతులు ఇంజనీరింగ్, పీజీ వివిధ రకాల వృత్తి నిపుణులు ఎక్కువమంది ఉన్నారని వారి సేవలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. రేష్నలైజ్ ప్రక్రియ తర్వాత Grama Sachivalayam లో మిగిలిపోయిన ఉద్యోగులను కీలక అవసరాలకు వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య వ్యవసాయ లాంటి శాఖలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది వారి వారి మాతృ శాఖతో సంబంధం ఉండడంతో పాటు గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణ కూడా ఉండేలా చూడాలని గ్రామ వార్డు సచివాలయ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో భారీగా బోగస్ పెన్షన్లు
అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది కేవలం 77% మంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు మిగిలిన 23% ఆన్లైన్ హాజరు నమోదు చేయట్లేదు. వాటి కారణాలను గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు వివరించారు చాలాచోట్ల సిబ్బంది ఇతర పనులకు డిప్యూటేషన్ వేయడం జరిగింది కావున గ్రామ సచివాలయాల్లో సర్వే పనులు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి కావున డిప్యూటేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇందులో కలెక్టర్లు సమాధానం ఇస్తూ కొంత సిబ్బందిని మేం వినియోగించుకుంటున్నాము మాకు అత్యవసరం అని అడగడం జరిగింది. కొంతమంది కలెక్టర్లు చాలాచోట్ల సిబ్బంది ఖాళీలు ఉన్నాయని సీఎం గారిని కోరారు. ఈ రేష్నలైజ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాటి భర్తీ ప్రక్రియ చూద్దామని సీఎం గారు సూచించారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు డెప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని కోరారు రేష్నలైజ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇది జరిగే అవకాశం ఉంది.
🔥మహిళలకు ప్రతినెల 7000 ఇచ్చే పథకం
ఈ మొత్తం ప్రక్రియ చూసుకుంటే Grama Sachivalayam హేతుబద్ధీకరణ త్వరలో జరగనుంది ఇందులో భాగంగా జనాభా ఆధారంగా సచివాలయాలు కొనసాగిస్తారు గత ప్రభుత్వంలో రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఉండేది ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి 5000 జనాభా కు ఒక సచివాలయం కేటాయిస్తే చాలావరకు సిబ్బంది మిగులు ఉంటుంది అటువంటి సిబ్బందిని ఇతర శాఖలో సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇలా సర్దుబాటు చేస్తే కొత్త నియామకాలు ఉండవు ఈ సిబ్బందికి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని సీఎం గారు ఆదేశించారు ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయ సమాచారం ఇది.
ఇటువంటి Grama Sachivalayam సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి