KVS Recruitment:
కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6700 పైగా పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది వీటికి సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే ఇటీవల కేంద్ర క్యాబినెట్ దేశవ్యాప్తంగా కొత్తగా 28 నవోదయ విద్యాలయాలు మరియు 85 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణలో 7 మంజూరు చేశారు. ఈ కొత్తగా మంజూరు చేసిన కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాల్లో 6700 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
మొత్తం ఖాళీల వివరాలు పరిశీలిస్తే నవోదయ విద్యాలయాల్లో(NVS) 1316 మరియు కేంద్రీయ విద్యాలయాల్లో(KVS) 5388 పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు అర్హత చూసుకుంటే టెన్త్ ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు ఉంటాయి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తారు. 18 నుండి 40 సంవత్సరాల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥రైల్వే శాఖలో 1800 ఉద్యోగాలు భర్తీ
త్వరలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది ఈ ఉద్యోగాలు భర్తీ కొరకు kvsangathan.nic.in వెబ్సైటు నందు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది త్వరలో విడుదల అయ్యే ఈ పోస్టుల కొరకు అభ్యర్థులు సిద్ధం అవ్వండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు సొంత రాష్ట్రంలో పనిచేసుకునే అవకాశం కల్పిస్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
Notification Update – Download
ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా 6700 పోస్టులు భర్తీ”