New Guidelines on Pension Distribution in AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు పెన్షన్ల పంపిణీ పై కీలక ఆదేశాలు జారి.

New Guidelines on Pension Distribution in AP

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇచ్చేలా, వరసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలల మొత్తం కలిపి ఇచ్చే వెసలబాటును ప్రభుత్వం కల్పించింది, దీనికి సంబంధించిన విధివిధానాలను తయారుచేయమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది, వారి ఆదేశాలు అనుసరించి ప్రభుత్వం నిన్న (21-11-2024) సర్కులర్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి  ప్రారంభం కానుంది ఏ కారణం చేత అయినా నవంబర్ నెల పింఛన్ తీసుకుని వారికి డిసెంబర్ నెలలో రెండు నెలల పింఛను కలిపి అందజేస్తారు.

🔥అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నవంబర్లో దాదాపు 45 వేల మంది వివిధ కారణాల చేత పింఛన్ తీసుకోలేకపోవడం అధికారులు గుర్తించారు,  నవంబర్లో పెన్షన్ తీసుకుని వారికి డిసెంబర్లో రెండు నెలల పింఛను కలిపి ఇవ్వనున్నారు.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 64.14 లక్షల మంది వివిధ రకాల పింఛన్  లబ్ధిదారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వేలాది మంది పించన్ దారులకు కష్టాలు తప్పి లబ్ధి చేకూరాలని ఉంది, పింఛన్ ఇచ్చే సమయానికి కొందరికి అనారోగ్యం వల్ల హాస్పిటల్ నందు ఉండవచ్చు, వృద్ధులైతే వారి పిల్లల దగ్గర లేదా పనుల నిమిత్తం వేరే దూరప్రాంతాల్లో నివసించవచ్చు, వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు  వారి పనుల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు, వీరంతా ఒకటో తారీకు పింఛన్ల కొరకు ఇంత ఊరికి చేరుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దూర ప్రాంతంలో పనులు చేస్తున్న వారైతే కేవలం పింఛన్ కోసం ఎక్కువ ఛార్జీలు పెట్టి రావలసి వస్తుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరందరికీ లబ్ధి చేకూర్చనుంది 

🔥విద్యార్థులకు హామీ లేకుండా 10 లక్షలు రుణం

New Guidelines on Pension Guidelines:

దీనిని నవంబర్ నెల నుండి ప్రభుత్వం అమలు చేయనుంది ఒకవేళ ఏదైనా కారణంతో నవంబర్ నెల పెన్షన్ తీసుకో లేకుంటే ఈ నెల డబ్బులు డిసెంబర్ నెలలో తీసుకోవచ్చు వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోలేని వారికి రద్దు చేయడం జరుగుతుంది ఒకవేళ అలా రద్దు జరిగితే స్థానిక సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ను కలిసి వాటికి సంబంధించిన తగు కారణాలను సమర్పిస్తే తిరిగి పెన్షన్ పునరుద్ధరిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన పూర్తి మార్గదర్శకాలు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి చదువుకోండి.

 Government Circular – Click Here

Join WhatsApp Group

ఇటువంటి New Guidelines on Pension సంబంధించిన సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

1 thought on “New Guidelines on Pension Distribution in AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు పెన్షన్ల పంపిణీ పై కీలక ఆదేశాలు జారి.”

Leave a Comment

error: Content is protected !!