New Rice cards in AP
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త తీసుకొచ్చింది కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి డిసెంబర్ 2 నుంచి ప్రక్రియ ప్రారంభించనుంది. కొత్తగా పెళ్లయిన జంటలకు మరియు రేషన్ కార్డులో మార్పులు చేయాలి అనుకుంటున్న వారికి కూడా అవకాశం కల్పించనుంది.
🔥AP లో పెన్షన్లు అందుకుంటున్న వారికి శుభవార్త
ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రీ డిజైన్ చేయబడిన రేషన్ కార్డులను జనాలకు అందించనుంది, ఈ ప్రక్రియను జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరి నాటికి రేషన్ కార్డులు జనాలకు అందేలా చూడాలని ప్రణాలికలు సిద్ధం చేసింది.
గత ఆరు నెలలుగా రేషన్ తీసుకుని కార్డులు అన్నిటిని తొలగించడం ద్వారా ప్రభుత్వానికి 90 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా వేయడం జరిగింది, వీటి స్థానంలో కొత్తవారికి రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వనుంది.
Rice Card పెండింగ్ అర్జీలు:
ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించిన చాలా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి వాటి అన్నిటిని పరిష్కరించి త్వరలోనే వారికి కావలసిన విధంగా రేషన్ కార్డు స్ప్లిట్, కొత్త రేషన్ కార్డు జారీ, రేషన్ కార్డు మైగ్రేషన్, కుటుంబ సభ్యులను జత చేయడం మరియు తీసివేయడం లాంటి సమస్యలను పరిష్కరించనుంది
ఇటీవల కేంద్రం రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ద్వారా సుమారు ఐదు లక్షల రేషన్ కార్డులను తొలగించడం జరిగింది, రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసి ఈ డిజిటల్లైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు దీని ద్వారా కేవలం అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వం అందించే రేషన్ అందాలని ఈ ప్రక్రియను ప్రారంభించారు.
Rice Cards దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
రేషన్ కార్డు దరఖాస్తు చేయాలంటే కింద తెలిపిన పత్రాలు సచివాలయం నందు సమర్పించాలి.
- ఆధార్ కార్డు
- కొత్త జంటలు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్
- చిన్న పిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్
- తొలగించుటకు డెత్ సర్టిఫికెట్ (మరణించిన వారిది)
- పెళ్లి అయిన వారికి తొలగించుటకు మ్యారేజ్ సర్టిఫికెట్
పై తెలిపిన పత్రాలు అన్ని మీ స్థానిక సచివాలయం నందు సమర్పించి మీకు కావాల్సిన Rice Cards సేవలను డిసెంబర్ 2 నుంచి పొందవచ్చు ఈ ప్రక్రియ ఒక నెల రోజుల లోపు పూర్తి చేసి సంక్రాంతి నాటికి కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
2 thoughts on “New Rice cards: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త కొత్త రేషన్ కార్డులు జారీ”