NLC నందు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:
నీవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) నందు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
NLC Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | జూనియర్ ఇంజనీర్ (సైంటిఫిక్) | 8 |
2 | జూనియర్ ఇంజనీర్ ( మైక్రో బయాలజీ) | 1 |
3 | జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) | 4 |
4 | జూనియర్ ఇంజనీర్ ( సివిల్) | 1 |
విద్యా అర్హత:
- జూనియర్ ఇంజనీర్ (సైంటిఫిక్) – B.Sc. కెమిస్ట్రీ / అప్లైడ్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఉండాలి
- జూనియర్ ఇంజనీర్ ( మైక్రోబయాలజీ) – B.Sc. మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి
- జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) – మెకానికల్/ ప్రొడక్షన్/ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ నందు మూడు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసి ఉండాలి
- జూనియర్ ఇంజనీర్ ( సివిల్) – సివిల్ ఇంజనీరింగ్ నందు మూడు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసి ఉండాలి
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి
వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఆకాశం కల్పించబడింది
జీతం వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులు నెలకు Rs.38,000/- జీతం పొందుతారు
దరఖాస్తు రుసుము:
UR / EWS / OBC (NCL) అభ్యర్థులు 595 రూపాయలు, SC /ST / PwBD అభ్యర్థులు 295 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (www.nlcindia.in.) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో Careers మీద క్లిక్ చేయాలి, అందులో Engagement of Scientific / Technical Personnel on FTE basis for CARD, NLCIL కింద అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ నింపవలసి ఉంటుంది
- అభ్యర్థులు కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు ద్వారా డైరెక్ట్ గా అప్లై చేయగలరు
ఎంపిక విధానం
- అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 30 డిసెంబర్, 2024.
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల, ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.