NPCI Details:
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలంటే ప్రతి ఒక్కరు NPCI లింక్ చేయించాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎలా చేయించాలి పూర్తి వివరాలు చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా మీ బ్యాంకు లేదా ఆంధ్ర ప్రదేశ్ వారు అయితే గ్రామ వార్డు సచివాలయం వెళ్లిన చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పరిశీలించ వచ్చు.
🔥పాత PAN CARD రద్దు ఇప్పుడు ఎలా
ఎందుకు చేసుకోవాలి:
ప్రభుత్వ పథకాలు నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేయాలంటే తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం అయితేనే ప్రభుత్వాలు మీ ఆధార్ నంబర్ ద్వారా మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేయగలవు కావున ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి దీనిని NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటారు.
🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ఈ లింక్ ఎలా చేయాలి..?
బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కోసం మొదట మీరు మీ బ్యాంక్ సందర్శించి అక్కడ సిబ్బందికి మీ బ్యాంకు పాస్ బుక్ మరియు ఆధార్ కార్డ్ ఇస్తే వారు వెంటనే అనుసంధానం చేస్తారు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంది తెలిసినవారు ఎన్ పి సి ఐ వెబ్సైట్ సందర్శించి అక్కడ కూడా అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
🔥కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
NPCI ప్రాముఖ్యత:
ప్రస్తుతం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు నేరుగా బ్యాంకులకు జమ చేయనున్నాయి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి మూడు సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా సిలిండర్ తీసుకున్న వారికి వారంలో వారి ఆధార్ నెంబర్ కు అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాకు డబ్బు జమ చేస్తున్నారు కావున ఈ NPCI అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పరిహారాలు మరియు రైతు భరోసా కూడా దీని ద్వారానే చెల్లిస్తారు మన రాష్ట్రంలో 50 లక్షల మందికి ఇంకా వారి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేదు కావున ప్రతి ఒక్కరూ మీ స్థానిక సచివాలయం లో కానీ బ్యాంకు ఖాతా ఉన్న చోట గాని పరిశీలించి లింక్ చేసుకోండి.
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “NPCI: ప్రభుత్వ పథకాలు అందాలంటే NPCI తప్పనిసరి ఎలా చేసుకోవాలి”