PM INTERNSHIP SCHEME:
దేశంలోని విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుటకు మరియు మెరుగైన ఉద్యోగాల సాధన కొరకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది, రానున్న ఐదేళ్ల కాలంలో కోటి మంది విద్యార్థులకు పైగా 500 టాప్ కంపెనీల నందు వారి నైపుణ్యం అభివృద్ధి పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ఈ సంవత్సరం (2024-25) లక్ష 25 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించనున్నారు, ఈ పథకంలో కంపెనీలు స్వచ్ఛందంగా విద్యార్థులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అందించనున్నాయి, విద్యార్థులకు ప్రతి నెల 5000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60 వేల రూపాయలు అందించడం జరుగుతుంది, అలాగే ఇంటర్న్‌షిప్ ఎంపికైన వెంటనే 6000 రూపాయలు వన్ టైం గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది.
ఈ పథకం కోసం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 800 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది, ఇంటర్న్‌షిప్ లో ఎంపికైన విద్యార్థులకు జీవిత బీమా ను పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా అందించనుంది దీనికి సంబంధించిన ప్రీమియంను కేంద్రమే భరిస్తుంది, ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సహాయం లో 500 రూపాయలు కంపెనీ తరఫునుండి మరియు 4500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందించడం జరుగుతుంది, ఈ పథకం రిజిస్ట్రేషన్ కొరకు నవంబర్ 15 వరకు కేంద్రం సమయాన్ని పొడిగించింది.
PM INTERNSHIP SCHEME అర్హతలు
వయోపరిమితి– అభ్యర్థుల వయసు 21 నుండి 24 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.
విద్య అర్హత – హై స్కూల్, పాలిటెక్నిక్, డిప్లమా, డిగ్రీ, బిఎ, బిఎస్స, బీకాం, బీఫార్మసీ డిగ్రీలు కలిగిన అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు, విద్యా ద్వారా డిగ్రీ పొందిన వారు కూడా ఈ పథకానికి అర్హులు,
PM INTERNSHIP SCHEME అనర్హతలు
- ప్రొఫెషనల్ కోర్సులు అయినటువంటి MBBS, MBA, CA, CMS మరియు ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ పథకానికి అనర్హులు,
- IIT, IIM నందు విద్యను అభ్యసించిన వారు మరియు కుటుంబ ఆదాయం 8 లక్షల పైబడిన వారు ఇన్కమ్ టాక్స్ చెల్లించువారు ఈ పథకానికి అనర్హులు
- కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఏదైనా స్కిల్, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ లేదా స్టూడెంట్ ట్రైనింగ్ పొందుతున్నవారు.
PM INTERNSHIP SCHEME దరఖాస్తు చేయు విధానం
- అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు
- రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు వారి ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుకు లింకు ఉన్న మొబైల్ నెంబర్ను వారి దగ్గరనే ఉంచుకోవాలి.
- అభ్యర్థులు వారి వివరాలను అందించిన తర్వాత ఒక రెస్యూమ్ తయారు చేయబడుతుంది.
- అభ్యర్థులు వారి విద్యా అర్హత, నైపుణ్యం, రాష్ట్రం, మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా ఏదైనా ఐదు కంపెనీల ఇంటర్న్‌షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు.
- ఎంపికైన విద్యార్థులకు వాట్సప్ ద్వారా మరియు మెసేజ్ ద్వారా సందేశం పంపించడం జరుగుతుంది
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “PM INTERNSHIP SCHEME : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం, నెలకు 5000 రూపాయలు స్టైపెండ్, మీరు అప్లై చేశారా…?”