TTD Recruitment 2024:
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సంబంధించిన సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి నందు పనిచేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఎంపిక అయితే జీతం 53,425/- లభిస్తుంది ఇందులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి నవంబర్ 25న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
🔥ECIL లో భారీ నోటిఫికేషన్ విడుదల
Organisation & Vacancies:
ఈ పోస్టులను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారు Official గా విడుదల చేయడం జరిగింది. ఉద్యోగం వస్తే సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి లో పనిచేయాలి ఇందులో 6 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం హిందువులు మాత్రమే దరఖాస్తు చేయాలి ఇందులో కేటగిరీ వారీగా ఖాళీలు కింద తెలిపిన విధంగా ఉన్నాయి.
- OC 2 పోస్టులు
- BC-B 1 పోస్టు
- BC-D(W) 1 పోస్టు
- SC(W) 1 పోస్టు
- BC-D 1 పోస్టు
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి MBBS ఏదైనా గుర్తింపు చెందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి ఉండాలి అలాగే మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ అయ్యి ఉండాలి.
🔥మహిళలకు 2500 ఇచ్చే పథకం పూర్తి వివరాలు
జీతం:
ఈ TTD ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 53,495/- లభిస్తుంది ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే GO.Ms.NO 105 ప్రకారం 18 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 25 నవంబర్ 2024న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మొత్తం ఎంపిక ప్రక్రియ కింద తెలిపిన విధంగా ఉంటుంది.
- మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ
- అందులో 80% మార్కులు మీ విద్యా అర్హత మెరిట్ ఆధారంగా తీసుకుంటారు
- పది మార్కులను అనుభవం ఆధారంగా సంవత్సరానికి ఒక మార్కు ఇస్తారు
- ఐదు శాతం మీరు పని చేసిన ఆసుపత్రి ఆధారంగా కేటాయిస్తారు
- ఐదు శాతం మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా ఇస్తారు
🔥SBI లో కొత్త నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం మీ బయోడేటా తో పాటు విద్య అర్హత సర్టిఫికెట్స్ తీసుకొని క్రింది తెలిపిన చిరునామా నందు 25 నవంబర్ 2024న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఇంటర్వ్యూ వేదిక: సెంట్రల్ హాస్పిటల్, తిరుపతి
Notification PDF – Click Here
Application PDF – Click Here
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ అయిన Teluguguruvu.com సందర్శించండి.
Good morning sir.madam
BC.D